బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు : వైఎస్ షర్మిల

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు :  వైఎస్ షర్మిల

హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాష్ట్రానికి వచ్చిన ప్రతి కేంద్రమంత్రి చెబుతున్నారు కానీ ఆ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ జరిపించటం లేదని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మించి ఐదేండ్లు కాకముందే డ్యామేజ్ లు జరుగుతున్నాయన్నారు. సోమవారం లోటస్ పాండ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని, తోడు దొంగలని ఆమె విమర్శించారు.