దొంగలకే మళ్లీ తాళాలు ఇచ్చిండు

దొంగలకే మళ్లీ తాళాలు ఇచ్చిండు
  • కేసీఆర్​పై  షర్మిల ఫైర్​

హైదరాబాద్, వెలుగు: దళిత బంధులో తమ ఎమ్మెల్యేలే కమీషన్లు తీసుకున్నరని చెప్పిన సీఎం కేసీఆర్, వారి చేతికే  మళ్లీ తాళాలు ఇచ్చిండని వైఎస్సార్‌‌టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు తన దగ్గర ఉన్నాయన్న కేసీఆర్, అర్హుల ఎంపిక బాధ్యత మళ్లీ  కమీషన్ల ఎమ్మెల్యేలకే ఎలా ఇచ్చారని ఆదివారం ట్విట్టర్‌‌లో ఆమె ఫైర్ అయ్యారు. నియోజకవర్గానికి 1,100 మంది అంటే ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తీసుకున్నా రూ.55 కోట్లు అవుతుంది.

100 నియోజకవర్గాల్లో రూ.6 వేల కోట్లు అవుతుందన్నారు. కమీషన్లు తీసుకొని ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అవినీతి బయటపెడితే  కేసీఆర్​ అవినీతిపై ఎమ్మెల్యేలు తిరగబడతారని ఆయన భయపడుతుండన్నారు.  కలెక్టర్ల ఆధ్వర్యంలోనే దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక జరగాలని  డిమాండ్ చేశారు.