పాలన చేతకాకపోతే పర్మినెంట్‌గా ఫామ్‌హౌస్‌లోనే ఉండు

V6 Velugu Posted on Oct 25, 2021

ప్రజల సమస్యలు వింటుంటే మనస్సు చలించిపోతుందన్నారు.. YSRTP అధ్యక్షురాలు షర్మిల. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఆరోరోజు పాదయాత్ర ప్రారంభించారు. తుమ్మలూరు గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు షర్మిల. కష్టాలు తీర్చేందుకు తానున్నానని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణాలో బడి పిల్లల టాయిలెట్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. ఆడపిల్లలకు నాణ్యమైన టాయిలెట్ వసతి కల్పించలేని కేసీఆర్  కు.. సీఎం పదవి ఎందుకని ప్రశ్నించారు. పాలన చేతకాకపోతే పర్మినెంట్ గా ఫామ్ హౌస్ లనే పడుకో అంటూ ట్వీట్ చేశారు షర్మిల. 

 

Tagged KCR, maheswaram, YS Sharmila questione, toilet facilities girls

Latest Videos

Subscribe Now

More News