టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పేనుతున్నవ్

టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పేనుతున్నవ్

స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను కేటాయిస్తామని చెప్తూ ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియకు తెరతీసింది. కొంతకాలంగా స్టూడెంట్లు లేని స్కూళ్లలోని పోస్టులను పూర్తిగా రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది. టీచర్ల రేషనలైజేషన్​తో పాటు కొత్త జిల్లాలకు కేటాయింపులు చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో వేల మంది టీచర్ల రోడ్డున పడనున్నారు. ఈ విషయంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఉద్యోగాలు కల్పించడం, పరిపాలన చేయడం చేతకానప్పుడు కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దండుగ అని ఆమె కామెంట్ చేశారు.

‘టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పేనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో..  సర్కార్ విద్యను మరియు సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పడు..  ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు..  పరిపాలన చేయడం చేతకానప్పుడు..  మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్’ అని ట్వీట్ చేశారు.