టీడీపీలోకి వివేకా కూతురు సునీత - ఆ రోజే ప్రకటన..!

టీడీపీలోకి వివేకా కూతురు సునీత - ఆ రోజే ప్రకటన..!

మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగనున్నారని ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. తాజాగా ఆమె టీడీపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా పోటీ చేసే స్థానం, టీడీపీలో చేరటానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 15న కడపలో సునీత తన పొలిటికల్ ఎంట్రీపై కెలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మొదట ఈ భేటీకి పులివెందులలో ఓ ఫంక్షన్ హాల్ ఫిక్స్ చేయగా అక్కడ పరిస్థితి అనుకూలించకపోవటం వల్ల సమావేశాన్ని  కడపకు మార్చినట్లు తెలుస్తోంది.

సునీత ఒప్పుకుంటే తనను కానీ, వివేకా భార్య సౌభాగ్యమ్మను కానీ పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీకి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని జగన్ పై వరుస విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సునీత కూడా టీడీపీలో చేరితే కడప రాజకీయం రసవత్తరమా మారే అవకాశం ఉంది. తన తండ్రిని చంపినవారిని శిక్షించాలంటూ సునీత చేస్తున్న ఒంటరి పోరాటానికి మొదటి నుండి బాబు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఆమె టీడీపీలో చేరటం ఖాయమే అన్న సంకేతాలు వస్తున్నాయి.

also read : ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ!

కాగా, షర్మిల ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న అంశంపై ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో సునీత ఏర్పాటు చేయబోయే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.మొదటి నుండి జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సునీత ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్లో జాన్ పై విమర్శల డోస్ పెంచారు. దీన్ని బట్టి చుస్తే ఆమె పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారనే అనిపిస్తోంది.