సీఎం పోస్టు కూడా కాంట్రాక్టు చేస్తే సరిపోదా?

సీఎం పోస్టు కూడా కాంట్రాక్టు చేస్తే సరిపోదా?

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘కాంట్రాక్ట్‌‌ లెక్చరర్‌‌, కాంట్రాక్ట్‌‌ డాక్టర్‌‌, కాంట్రాక్ట్‌‌ ఇంజనీర్‌‌.. ఇలా అన్ని ఉద్యోగాలను కాంట్రాక్టు పెట్టుకుంటూ పోయే బదులు ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్‌‌ మీద పెట్టుకుంటే సరిపోదా?’’ అని వైఎస్సార్‌‌ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. రాష్ట్రం వస్తే కాంట్రాక్టు ఉద్యోగాలనే పదమే ఉండదని చెప్పి.. ఇప్పుడు ఉద్యోగాలన్నీ ఔట్‌‌ సోర్సింగ్‌‌లో నింపుతారా? అని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె ట్వీట్‌‌ చేశారు. ‘‘ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్‌‌లు తీసుకొని, ఏజ్‌‌ బార్‌‌ అయి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే రాక్షసానందం పొందేందుకేనా మీరు సీఎం అయింది” అంటూ కేసీఆర్‌‌పై ఫైర్ అయ్యారు. రెగ్యులర్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు.