పోలీసు స్టేషన్లో యుగ తులసి శివకుమార్ నిరసన

పోలీసు స్టేషన్లో యుగ తులసి శివకుమార్ నిరసన

హైదరాబాద్: గో ఆగ్రహ నిరాహారదీక్షకు బయలుదేరిన యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ ని రాంగోపాల్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. దీంతో పోలీసు స్టేషన్ లోనే శివకుమార్ తో పాటు గో సంరక్షక కార్యకర్తలు దీక్షకు దిగారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహదూర్ పుర వెళ్లి తీరుతామని హెచ్చరించారు. గో సంరక్షణ బిల్లును తెచ్చే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు శివకుమార్.