BSNL బ్రాడ్‌బ్యాండ్ యూజర్స్ కు గుడ్ న్యూస్..YuppTV స్కోప్ లాంచ్

BSNL బ్రాడ్‌బ్యాండ్ యూజర్స్ కు గుడ్   న్యూస్..YuppTV స్కోప్ లాంచ్

హైదరాబాద్: బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌తో కలిసి యప్‌‌టీవీ స్కోప్‌‌ను లాంచ్‌‌ చేశామని గ్లోబల్‌‌ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌ యప్‌‌టీవీ బుధవారం ప్రకటించింది. ఇదొక సింగిల్‌‌ సబ్‌‌స్క్రిప్షన్‌‌ వీడియో స్ట్రీమింగ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ అని, ఒక్కసారి  సబ్‌‌స్క్రయిబ్‌‌ అయితే చాలు సోనిలైవ్‌‌, జీ5, వూట్‌‌ సెలెక్ట్‌‌, యప్‌‌టీవీ వంటి ప్రీమియం ఓటీటీ యాప్‌‌లను యాక్సెస్‌‌ చేసుకోవచ్చని పేర్కొంది. బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ బ్రాడ్‌‌బ్యాండ్ యూజర్లకు బండిల్డ్‌‌ ఓటీటీ సర్వీస్‌‌లను ఆఫర్‌‌‌‌ చేయడానికి గతంలోనే ఎంఓయూ కుదుర్చుకున్నామని  యప్‌‌టీవీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.

ప్రస్తుతం బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ బ్రాడ్ బ్యాండ్ యూజర్ల కోసం వీడియో సర్వీస్‌‌లను తీసుకొచ్చామని తెలిపింది. సాఫ్ట్‌‌ వేర్ యాజ్‌‌ ఏ సర్వీస్‌‌ ఎనేబుల్డ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌గా యప్‌‌టీవీ ఉందని, కస్టమర్లకు నిరంతరంగా సర్వీస్‌‌లను అందించేందకు కంటెంట్‌‌ పార్టనర్లు, బ్రాడ్‌‌కాస్టర్లు, టెలికాం, బ్రాడ్‌‌బ్యాండ్ ప్రొవైడర్లకు ఓ ఎకోసిస్టమ్‌‌ను ప్రొవైడ్ చేస్తున్నామని తెలిపింది. స్మార్ట్‌‌ టీవీ, పీసీ, మొబైల్‌‌, ట్యాబ్లెట్‌‌లలో యప్‌‌టీవీని యాక్సెస్‌‌ చేసుకోవచ్చు.

యప్‌టివి పరిధి గురించి మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి www.yupptvscope.com