68వ నేషనల్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ లో యువేక్‌‌–వెంకట్‌‌ లక్ష్మికి స్వర్ణం

68వ నేషనల్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ లో యువేక్‌‌–వెంకట్‌‌ లక్ష్మికి స్వర్ణం

న్యూఢిల్లీ: తెలంగాణ షూటర్లు యువేక్‌‌ బత్తుల–లక్కు వెంకట్‌‌ లక్ష్మి జోడీ.. 68వ నేషనల్‌‌ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ (షాట్‌‌గన్‌‌)లో గోల్డ్‌‌ మెడల్‌‌తో మెరిసింది. డాక్టర్‌‌ కర్ణి సింగ్‌‌ షూటింగ్‌‌ రేంజ్‌‌లో బుధవారం జరిగిన జూనియర్‌‌ స్కీట్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఫైనల్లో యువేక్‌‌ బత్తుల–లక్కు వెంకట్‌‌ లక్ష్మి 38–37తో జ్యోతిరాదిత్య సిసోడియా–వంశిక తివారీపై గెలిచారు. హోరాహోరీగా సాగిన పోటీలో యువేక్‌‌, వెంకట్‌‌ లక్ష్మి చెరో 19 హిట్స్‌‌ కొట్టగా, సిసోడియా 17, వంశిక 20కే పరిమితమయ్యారు. 

పంజాబ్‌‌కు బ్రాంజ్‌‌ మెడల్‌‌ లభించింది.  క్వాలిఫికేషన్స్‌‌లో యువేక్‌‌ (73), వెంకట్‌‌ లక్ష్మి (66).. 144 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచారు. సీనియర్‌‌ స్కీట్‌‌ మిక్స్‌‌డ్‌‌ టీమ్‌‌ ఫైనల్లో అనంత్‌‌జీత్‌‌ సింగ్‌‌ నరుకా–దర్శనా రాథోడ్‌‌ 45–43తో మైరాజ్‌‌ అహ్మద్‌‌ ఖాన్‌‌–అరీబా ఖాన్‌‌పై నెగ్గి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు. గోల్డ్ మెడల్‌‌ మ్యాచ్‌‌లో అనంత్‌‌జీత్‌‌ 21, దర్శన 24 సార్లు టార్గెట్‌‌ను అందుకోగా, మైరాజ్‌‌ 21, అరీబా 22 సార్లకే పరిమితమయ్యారు. రైజా దిల్లాన్‌‌–ఇషాన్‌‌ సింగ్‌‌ లిబ్రా 41–39తో మధ్యప్రదేశ్‌‌ షూటర్లపై గెలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు.