Yuzvendra Chahal: ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ జట్టు.. ఈసారి ఎలాగైనా తమ తొలి టైటిల్‌ను గెలవాలని పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో జట్టులో కీలక స్పిన్నర్‌గా ఉన్న యుజ్వేంద్ర చహల్, తన వ్యక్తిగత జీవితం, ఫిట్‌నెస్‌కు సంబంధించి ఒక కీలక విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ నిర్వహించిన ఒక పోడ్‌కాస్ట్‌లో అతడు మాట్లాడుతూ.. తాను గత ఆరు నెలలుగా మద్యం సేవించడం మానేశానని వెల్లడించారు. ప్రస్తుతం నాకు 35 ఏళ్లు, కాబట్టి నేను మరింత యాక్టివ్‌గా ఉండాలని భావిస్తున్నాను.. పంజాబ్ కింగ్స్ కోసం నా శ్రమను 150 శాతం అందించాలనుకుంటున్నాను.. ఒక సీనియర్ ప్లేయర్‌గా, ఐపీఎల్‌లోని యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా మంచి విషయాన్ని నేర్చుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని చాహల్ తెలిపారు.
గత సీజన్ లో ఎదురైన చేదు అనుభవాలే నాలో ఈ మార్పుకు కారణమైంది.. 2025 ఎడిషన్ లో రెండుసార్లు తీవ్రంగా గాయపడ్డాను.. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ తర్వాత పక్కటెముక విరిగింది, ప్లేఆఫ్స్ కి ముందు చేతి వేలి కీలు విరిగిందని తెలిపాడు. ఈ గాయాల కారణంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో తాను సరిగ్గా లెగ్ స్పిన్ వేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నా ప్రదర్శన పట్ల నేనే అసంతృప్తిగా ఉన్నాను.. గాయాల వల్ల కీలక మ్యాచ్‌ల్లో జట్టుకు పూర్తి స్థాయిలో ఉపయోగపడలేకపోయాను.. అందుకే ఈ ఏడాది నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాను అని యూజీ స్పష్టం చేశారు.
2026 ఐపీఎల్ సీజన్ కి పూర్తి ఆరోగ్యంతో మైదానంలోకి అడుగు పెట్టేందుకు చాహల్ సిద్ధమవుతున్నారు. 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్న అతడు, ఇప్పటివరకు 172 మ్యాచ్‌ల్లో 221 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన స్పిన్నర్ గా కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ తరపున ఫైనల్స్ ఆడినా, ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండి ట్రోఫీని ముద్దాడే ఛాన్స్ రాలేదు. ఈసారి పంజాబ్ కింగ్స్ తరపున ఆ కల నెరవేర్చుకోవాలని యూజీ పట్టుదలతో ఉన్నారు. త్వరలోనే ప్రారంభమయ్యే ఐపీఎల్ లో మార్చి 31న గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

🚨YUZVENDRA CHAHAL HAS STOPPED CONSUMING ALCOHOL🍾:

He Said 🎙️- I stopped alcohol. It’s been more than six months. I am 35 now. This year my mind has said that I will take care of my body first. I want to give 150 percent to my team.🤯 pic.twitter.com/iJG3fLWrjF
— Jaya Nayak (@jayanayak125) March 19, 2026