వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డిని ఆ పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ నియమించారు.  రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి,  లోక్  సభలో మిథున్ రెడ్డి ఉంటారని తెలిపారు. వైసీపీ ఎంపీల సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై వారితో జగన్ చర్చించారు. ఇప్పుడు ఎదురుకుంటున్న పరిస్థితులు తాత్కలికమేనన్న జగన్...  ప్రజల ముందు తలెత్తుకునేలా పార్లమెంట్ లో పోరాడలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్.  తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని .. ఈలోగా నేతలు ధైర్యం కోల్పోవద్దు అని జగన్ సూచించారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అసెంబ్లీలో  11 స్థానాలను, 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇక రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది సభ్యులున్నారు.