గాంధీ భవన్ ఎదుట జహీరాబాద్ నేతల నిరసన

గాంధీ భవన్ ఎదుట జహీరాబాద్ నేతల నిరసన
  • సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సోమవారం గాంధీ భవన్ ముందు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు నిరసన తెలిపారు. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జిగాఉన్న మాజీ మంత్రి చంద్ర శేఖర్​ను బాధ్యతల నుంచి తప్పించాలని, పార్టీలోని సీనియర్లకు పార్టీ, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలంటూ నినాదాలు చేశారు.

పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ భవన్ ఇన్​చార్జికి వినతిపత్రం ఇచ్చారు. ఈ నిరసనపై ఎంపీ సురేశ్ షెట్కార్ స్పందిస్తూ.. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను, వారు పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయంపై అందరం కలిసి చర్చించుకుంటామని చెప్పారు. గ్రామ, మండల కమిటీల నియామకంలో అందరికీ గుర్తింపు ఉంటుందన్నారు.