ఎవరు బతకాలో వెపన్లు డిసైడ్ చేస్తున్నయ్.. ప్రపంచంలో వినాశకరమైన ఆయుధాల పోటీ: జెలెన్ స్కీ

ఎవరు బతకాలో వెపన్లు డిసైడ్ చేస్తున్నయ్.. ప్రపంచంలో వినాశకరమైన ఆయుధాల పోటీ: జెలెన్ స్కీ

న్యూయార్క్: ప్రస్తుత ప్రపంచం మానవ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన ఆయుధాల వెనుక పరిగెత్తుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. ఎవరు బతకాలో ఆయుధాలు నిర్ణయిస్తున్నాయన్నారు. బుధవారం యూఎన్  జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు యూరప్ మీదా రష్యా అధ్యక్షుడు పుతిన్ కన్నేశారని, యూరప్‎కూ యుద్ధం విస్తరించాలనుకుంటున్నారని ఆరోపించారు.

ఉక్రెయిన్, గాజా, సుడాన్ సహా ప్రపంచంలో యుద్ధాలను యూఎన్ వంటి అంతర్జాతీయ వ్యవస్థలు ఆపలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాలతో మాత్రమే దేశాలు మనుగడ సాగించలేవన్నారు. రష్యా తీరును యూఎన్  సభ్య దేశాలన్నీ ఖండించాలని కోరారు. కాగా, అంతకుముందు అమెరికా అధ్యక్షుడు  ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ అయ్యారు.