చదువుకున్నవారు కూడా పెద్ద పెద్ద స్కాంలు చేస్తున్న ఈరోజుల్లో నాలుగో తరగతి చదివిన కుర్రోడు నిజాయితీ చాటుకున్నాడు. రోడ్డు మీద రూ. రెండు లక్షలు దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...నాలుగో తరగతి చదువుకున్న షైక్ వలీ జెప్టో డెలివరీ బాయ్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రశాంత్ అనే వ్యక్తి ఫార్మసీకి సంబందించిన రూ. 5 లక్షలు డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బు షేక్ వలీకి దొరకడంతో నాగోల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. దీంతో పోలీసులు ప్రశాంత్ ను పిలిచి రూ. రెండు లక్షలు అప్పగించారు.
చదివింది తక్కువే అయిన నిజాయతీ చాటుకున్నందుకు షేక్ వలీని అభినందించి సన్మానం చేశారు నాగోల్ పోలీసులు. బాధితుడు ప్రశాంత్ కు అలీ చేతుల మీదుగా డబ్బులు ఇప్పించారు పోలీసులు. నిజాయతీ చాటుకున్న వలీకి రివార్డు అందించిన నాగోల్ సీఐ.
