అన్‌లాక్ తర్వాత రెస్టారెంట్లపై జోమాటో సర్వే

అన్‌లాక్ తర్వాత రెస్టారెంట్లపై జోమాటో సర్వే

రెస్టారెంట్‌లు బాగానే ఉన్నయంట!

బయట తినే ఫుడ్ వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న ఆధారమేదీ లేకపోయినా అలా తినకుండా ఉండటమే మంచిదంటున్నారు డాక్టర్స్. అయితే డాక్టర్ల మాటలే కాదు, కరోనా భయం కూడా జనాన్ని ఆపలేకపోతున్నట్టే ఉంది పరిస్థితి చూస్తుంటే. అన్​లాక్​ 5 మొదలైనప్పటి నుంచి జనాలు బయటకు బాగానే వస్తున్నారు. బిజినెస్​లు కూడా దాదాపుగా మొదలయ్యాయి. రెస్టారెంట్​లు కూడా తెరుచుకున్నాయి. కొన్ని రెస్టారెంట్స్​లో కస్టమర్స్‌‌‌‌మధ్య  కచ్చితంగా ఫిజికల్ డిస్టెన్స్‌‌‌‌ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు.  కానీ, రోడ్ల పక్కన ఉండే చిన్న చిన్న హోటల్స్​లో  సోషల్‌‌‌‌ డిస్టెన్సింగ్‌ కుదిరే పని కాదు. చిన్న రూముల్లో ఒకేసారి గుంపులు గుంపులుగా తింటుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రెస్టారెంట్​ల బిజినెస్​ ఎలా? అనే అనుమానం వస్తుంది కదా! అయితే లాక్​డౌన్​, కరోనా ప్రభావం రెస్టారెంట్ల​ బిజినెస్​ మీద ఏమంత లేదని ‘జొమాటో ఫుడ్’​ యాప్​ చేసిన ఒక సర్వేలో వెల్లడైంది.

మూతపడ్డవి తక్కువే

ఈ సర్వే ప్రకారం… హోటల్ అండ్ రెస్టారెంట్స్ ఇండస్ట్రీ మీద కరోనా  ప్రభావం తీవ్రంగా పడింది. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా రెస్టారెంట్స్ వేగంగా మార్పులు చేసుకుంటున్నాయి. కరోనా ప్రభావం నుండి ఫుడ్ ఇండస్ట్రీ తొందరగానే తేరుకోవడం ఖాయం. వచ్చే రెండు మూడు నెలల్లో -రెస్టారెంట్స్ బిజినెస్​ కోవిడ్​కి ముందు ఎలా ఉందో అదే స్థాయికి చేరుకుంటుందంటోంది ఆ నివేదిక.

అంటే మొత్తం మీద రెస్టారెంట్​ బిజినెస్​కు అంతగా వాటిల్లే నష్టం ఏమీ లేదన్నమాట. ఎంతైనా తిండి మ్యాటర్​ కదా!

ఈ సర్వేను జొమాటో 15,000 రెస్టారెంట్ల మీద చేసింది. ఆగస్ట్ 1 నుంచి మొదలుపెట్టిన ఈ సర్వేలో ప్రతి సిటీలో వెయ్యి రెస్టారెంట్లను తీసుకుంది. కోల్‌‌‌‌కతాలో ఎక్కువ రెస్టారెంట్లు పనిచేయడం మొదలుపెట్టగా, చెన్నైలో ఆ సంఖ్య తక్కువగా ఉంది. ఢిల్లీలో 12 శాతం, చెన్నైలో 9 శాతం, కోల్‌‌‌‌కతాలో 29 శాతం రెస్టారెంట్ల తెరిచారు. ఆగస్ట్ తో పోల్చుకుంటే అక్టోబర్ ఒకటి లోపు ఆ సంఖ్య రెట్టింపైంది. పుంజుకుంటున్న వాటితో పోలిస్తే మూతబడ్డ హోటల్స్, రెస్టారెంట్స్ చాలా తక్కువ అంటోంది ఈ సర్వే.

For More News..

గూగుల్‌‌‌‌‌‌‌‌లో తెగ వెతుకుతున్న ఈ డైట్ మంచిదేనా?

తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు

టీఆర్పీ రేటింగ్ కోసం ఇంటికి రూ.500 ఇస్తున్న టీవీ చానల్