ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.  అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న  పలు బిల్లులు కేబినెట్‌లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఎలా ఉండాలనే దానిపై కేబినెట్‌లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు, కార్మికులు చేస్తోన్న ఉద్యమం, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించే అవకాశం ఉంది. శాసన రాజధాని కోసం 3000 కోట్లు బాంక్ గ్యారంటీ అంశంపై కేబినెట్‌లో చర్చ జరుగనుంది. అలాగే తెలంగాణతో నీటి వివాదాలు, ప్రాజెక్టుల వివాదాలపై ఎలా చేస్తే బాగుంటుందని సీఎం జగన్ సహచర మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నేటి నుంచి జేఈఈ మెయిన్​..తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం

తెలంగాణ, ఏపీ ఇంటర్‌‌ బోర్డుల అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు

అక్కడ రోడ్లపై చెత్త వేస్తే రూ. 5 వేలు ఫైన్