ఏప్రిల్ 20న  దరువు జాతర

ఏప్రిల్ 20న  దరువు జాతర

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆత్మబలిదానాలను, వారి త్యాగాలను పాటల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పడంలో ‘దరువు’ సాంస్కృతిక వేదిక కీలక పాత్ర పోషించిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు.

సోమవారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో  ఆయన మాట్లాడుతూ..  దరువు సాంస్కృతిక వేదిక ఏర్పడి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 20న రవీంద్రభారతిలో దరువు జాతర పేరిట భారీ సభ నిర్వహిస్తున్నట్లు వేదిక వ్యవస్థాపకులు దరువు ఎల్లన్న, దరువు అంజన్నతో కలిసి ఆయన ప్రకటించారు. ఈ వేడుకలకు సంబంధించి రూపొందించిన వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు.