
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. కళావతి నువ్వే గతి అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సమకూర్చిన మెలోడీ బాణీకి.. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ప్రాణం పోశాడనే చెప్పాలి. థమన్, సిద్ శ్రీరామ్ తోపాటు పాట కంపోజింగ్ లో పని చేసిన మిగిలిన కళాకారులు ఈ మ్యూజిక్ వీడియోలో కనిపించారు. అయితే కళావతి నువ్వే లేకుంటే అధోగతి అంటూ మహేశ్ వేసిన స్టెప్స్ అలరించాయి. అదే సమయంలో మహేశ్ తో కీర్తి వేసిన మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. మొత్తానికి సర్కారు వారి పాట నుంచి అప్ డేట్ రావడం లేదని బాధపడుతున్న మహేశ్ అభిమానులకు.. కళావతి మ్యూజిక్ వీడియోతో మేకర్స్ కాస్త రిలీఫ్ ఇచ్చారనే చెప్పాలి.
మరిన్ని వార్తల కోసం: