
‘పుష్ప’ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు అల్లు అర్జున్. ప్యాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ రికార్దు స్థాయి వసూళ్లతో దూసుకెళుతోంది. దీంతో ఫిబ్రవరి నుంచి ఈ మూవీ సీక్వెల్ అయిన ‘పుష్ప.. ద రూల్’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మరోవైపు గతంలో తనకు ‘సరైనోడు’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ డ్యూయెల్ రోల్‌లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్‌లో డబుల్ రోల్ చేస్తుండడం ఇదే ఫస్ట్ టైమ్. ‘సరైనోడు’ లాంటి సూపర్ హిట్ తర్వాత బన్నీ, బోయపాటి శ్రీను కలిసి వర్క్ చేస్తున్న మూవీ కావడం, మరోవైపు బోయపాటి కూడా ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.