- గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్, జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ కీర్తిప్రకాశ్, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు
యాదగిరిగుట్ట, వెలుగు: విద్యార్థుల్లో సృజనాత్మక, టెక్నికల్ టాలెంట్ ను వెలికితీయడం కోసమే ప్రభుత్వం ఏటా 'సృజన టెక్ ఫెస్ట్' ను నిర్వహిస్తోందని గీతం యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. నవీన్, జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ కీర్తిప్రకాశ్ తెలిపారు. యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యార్థులకు నిర్వహించిన జిల్లాస్థాయి 'సృజన టెక్ ఫెస్ట్' లో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు కోఆర్డినేటర్ గా వ్యవహరించగా.. నవీన్, కీర్తిప్రకాశ్ జడ్జీలుగా వ్యవహరించారు.
టెక్ ఫెస్ట్ లో భాగంగా.. యాదగిరిగుట్ట, నల్గొండ, తిరుమలగిరి పాలిటెక్నిక్ కళాశాల మెకానికల్ విభాగానికి చెందిన విద్యార్థులు పలు రకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. డిజైన్, ఫాబ్రికేషన్ ఆఫ్ సోలార్ పవర్డ్ మెటీరియల్ హ్యాడ్లింగ్ సిస్టం' పై యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు, డిజైన్ ఫాబ్రికేషన్ ఆఫ్ సోలార్ పవర్డ్ ఆటోమేటిక్ డ్రైన్ క్లీనింగ్ మెషీన్' పై నల్గొండ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, ' సోలార్ పవర్డ్ హాక్ సా మెషీన్'పై తిరుమలగిరి పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ రాజగోపాల్ రెడ్డి, మెకానికల్ బ్రాంచ్ హెడ్ రామానాయుడు పాల్గొన్నారు.
