నిమ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో స్మార్ట్ సిటీ...జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 3,245 ఎకరాల్లో రూ.2,369 కోట్లతో పనులు

నిమ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో స్మార్ట్ సిటీ...జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 3,245 ఎకరాల్లో రూ.2,369 కోట్లతో పనులు
  • ఈ నెల 10న వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ 
  • ఏర్పాట్లు చేసిన అధికారులు

సంగారెడ్డి/ఝరాసంగం, వెలుగు: నేషనల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో స్మార్ట్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,245 ఎకరాల్లో రూ.2,369 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులను ఈనెల 10న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జహీరాబాద్ ప్రాంతం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందనుంది. 

3,245 ఎకరాల్లో స్మార్ట్ సిటీ 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో 12,350 ఎకరాల్లో నిమ్జ్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో  స్మార్ట్ సిటీ కోసం ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్-– నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా నిమ్జ్ మొదటి విడత పనులు ఝరాసంఘం, న్యాల్కల్ మండలాల పరిధిలో షురూ కానున్నాయి. 

ఈ స్మార్ట్ సిటీ మెగా ప్రాజెక్టు పనులను ఈనెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించనున్నారు. 12,350 ఎకరాల్లో విస్తరించనున్న నిమ్జ్ ప్రాజెక్టులో స్మార్ట్ సిటీ కోసం 3,245 ఎకరాలను కేటాయించారు. దీనికోసం రూ.2,369 కోట్ల అంచనాతో ప్రాజెక్టు చేపడుతుండగా ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.1,500 కోట్లు కేటాయించాయి.

మౌలిక వసతుల కల్పనే లక్ష్యం 

మౌలిక వసతుల కల్పనలో భాగంగా స్మార్ట్ సిటీలో అధునాతన సౌకర్యాలు సమకూర్చనున్నారు. సిక్స్ లేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోర్​ లేన్​రోడ్లు, వాటి పక్కనే సర్వీస్ రోడ్లు, భారీ బ్రిడ్జిలు, విద్యుత్, ఆరోగ్య సెంటర్లు, స్కూల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. తదితరల మౌలిక అవసరాలను మూడేళ్ల వ్యవధిలో నిర్మించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 65వ నేషనల్ హైవే నుంచి నిమ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు రూ.100 కోట్లతో ఇప్పటికే రహదారి పనులు కొనసాగుతున్నాయి. దీనికి అనుసంధానంగా 60 మీటర్ల వెడల్పుతో  8.95 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. అంతర్గతంగా 45 మీటర్ల వెడల్పుతో 11.68 కిలోమీటర్లు, 30 మీటర్ల వెడల్పుతో 10 కిలోమీటర్లు, 24 మీటర్ల వెడల్పుతో 16 కిలోమీటర్లు మొత్తం 47.82 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్లు నిర్మించనున్నారు. 

ఇందుకోసం మొదటి విడతలో 433 ఎకరాలను కేటాయించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ స్మార్ట్ సిటీలో అన్ని హంగులతో సౌకర్యాలు కల్పిస్తే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. మొత్తం మీద నిమ్జ్ ప్రాజెక్టులో స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ పనులు మొదలవుతున్న క్రమంలో సంగారెడ్డి జిల్లాలో పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు మాదిరిగా జహీరాబాద్ ప్రాంతం మరో ఇండస్ట్రియల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారనుంది.