హైదరాబాద్ లో దళితబంధు, ఉద్యోగాల పేరుతో రూ. 25 లక్షల మోసం...నిందితుడిపై కేసు

హైదరాబాద్ లో దళితబంధు, ఉద్యోగాల పేరుతో రూ. 25 లక్షల మోసం...నిందితుడిపై కేసు

మేడిపల్లి, వెలుగు: దళితబంధు పథకం కింద వాహనం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రిటైర్డ్ ఉద్యోగి ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు కాజేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ రాధాకృష్ణ కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బుడుత వినోద్‌కుమార్ (62)కు నాలుగేళ్ల కింద ఖైరతాబాద్ ఆనంద్​నగర్​కు చెందిన చందనగిరి శ్రీకాంత్ (35) పరిచయమయ్యాడు. 

వినోద్​కుమార్ కుమారులకు, కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి దశలవారీగా రూ. 14.24 లక్షలు, దళితబంధు వాహనం మంజూరు చేయిస్తానని రూ. 2 లక్షలు, వ్యక్తిగత అవసరాల కోసం మరికొంత మొత్తంతో కలిపి మొత్తం రూ. 25 లక్షలను శ్రీకాంత్ వసూలు చేశాడు. అయితే, చెప్పినట్లుగా ఉద్యోగాలు ఇప్పించకపోగా, వాహనం కూడా మంజూరు చేయించలేదు. బాధితుడు డబ్బులు తిరిగి అడగగా, శ్రీకాంత్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు శుక్రవారం ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.