అంగన్వాడీలకు కొత్త బిల్డింగ్‌‌లు.. 329 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇటీవల రూ. 30.06 కోట్లు రిలీజ్ 

అంగన్వాడీలకు కొత్త బిల్డింగ్‌‌లు.. 329 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఇటీవల రూ. 30.06 కోట్లు రిలీజ్ 
  •  కరీంనగర్, రాజన్న జిల్లాల్లో పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్లకూ కొత్త భవనాలు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: విద్య, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. కొత్తగా అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లు, ప్రైమరీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు బిల్డింగ్​లు నిర్మించేందుకు  నిర్ణయించింది. దీనిలో భాగంగా. ఈ క్రమంలో 329 అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలకు కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించేందుకు ఇటీవల రూ.30.06కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. దీంతో ఇన్నాళ్లూ అరకొర వసతులున్న అద్దె భవనాలు, పాత బిల్డింగుల్లో ఉన్న అంగన్​వాడీలకు మహర్దశ రానుంది.  

డీఎంఎఫ్టీ నిధులు రిలీజ్ 

ఉమ్మడి జిల్లాలో 329 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు రిలీజ్​చేసింది. దీనిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 170 అంగన్వాడీ సెంటర్లకు  డీఎంఎఫ్టీ నిధులు రూ. 20 కోట్లు కేటాయించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 170 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో గతంలో 49 నిర్మాణాలు ఆగిపోగా ఆ పనులకోసం నిధులు కేటాయించారు. కొత్తగా మరో 121 అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీల కోసం బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించనున్నారు. కరీంనగర్ జిల్లాలో రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం చామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో, బద్దిపల్లి గ్రామాల్లోని అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలకు కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి రూ.20లక్షలు రిలీజ్ అయ్యాయి.

జగిత్యాల జిల్లాలోని 63 అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మంజూరయ్యాయి.  వీటి కోసం ఈజీఎస్, 15వ ఫైనాన్స్, మాత శిశు సంక్షేమ శాఖల నుంచి ఫండ్స్ రిలీజ్ చేశారు. ఒక్కో బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.12 లక్షల చొప్పున 63 బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ. 7.56 కోట్లు శాంక్షన్ అయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 706 అంగన్వాడీ  సెంటర్స్ ఉండగా, 258 సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. కాగా 96 భవనాల రిపేర్ల కోసం ప్రభుత్వం రూ. 2.50 కోట్లు మంజూరు చేసింది. కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణాలను 6 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. 

రాజన్న, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో హెల్త్ సెంటర్లకు.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయా మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు 16 హెల్త్​ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లకు సొంత బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి రూ.3.20 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే 4 సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెంటర్ల భవనాలు పూర్తయ్యాయి.  ఆరు నిర్మాణంలో ఉండగా.. మరో ఆరింటి పనులు ప్రారంభం కానున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వీటితో పాటు మూడు ప్రీప్రైమరీ హెల్త్ సెంటర్లకు కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణాలకు రూ. 4.68కోట్లు మంజూరయ్యాయి. ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తికాగా.. దీన్ని రెండు నెలల కింద కలెక్టర్ సందీప్ కుమార్​ఝా ప్రారంభించారు.

గంభీరావుపేట పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రుద్రంగి మండల కేంద్రంలోని హెల్త్ సెంటర్ నిర్మాణంలో ఉంది.  కరీంనగర్ సిటీలో మూడు అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రూ.4.29కోట్లు మంజూరయ్యాయి. సప్తగిరి కాలనీ, కట్టరాంపూర్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో ఈ యూపీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు కొనసాగుతున్నాయి. గన్నేరువరం పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకి రూ. 1.43 కోట్లు మంజూరయ్యాయి. 

విద్య, వైద్యానికి ప్రాధాన్యం 

రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా రాజన్న జిల్లాలో 3 ప్రైమరీ, 16 సబ్ సెంటర్లకు కొత్త బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి ఫండ్స్ మంజూరు చేసింది. నిర్మాణ పనులను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం- సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా,  రాజన్నసిరిసిల్ల కలెక్టర్​