V6 News

ఫైర్ సిబ్బందికి  జాతీయ పురస్కారాలు

ఫైర్ సిబ్బందికి  జాతీయ పురస్కారాలు
  • కేంద్ర ప్రభుత్వ సివిల్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ అవార్డులకు10 మంది ఎంపిక

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అగ్నిమాపక శాఖ సిబ్బంది జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఫైర్ ఫైటింగ్ లో అందించిన ఉత్తమ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వ సివిల్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ పురస్కారాలకు 10 మంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది అత్యుత్తమ విధి నిర్వహణ, ధైర్యసాహసాలకు కేంద్రం ఏటా ఈ అవార్డులు అందిస్తోంది. తెలంగాణలోని పలు ఫైర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల పరిధిలో పనిచేసే సిబ్బంది పురస్కారాలకు ఎంపికవడం పట్ల రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌మాన్‌‌‌‌‌‌‌‌ గురువారం హర్షం వ్యక్తం చేశారు. అవార్డులకు ఎంపికైన వారిని అభినందించి, మరింత నిబద్ధతతో సేవలందించాలని సూచించారు. 

పురస్కారాలకు ఎంపికైన వారు వీరే.. 

బి.సుధాకర్(స్టేషన్ ఫైర్ ఆఫీసర్, గౌలిగూడ), జి.యాదగిరి(లీడింగ్ ఫైర్ ఫైటర్, సెక్రటేరియెట్), ఎండీ.గౌస్ పాషా(లీడింగ్ ఫైర్ ఫైటర్, గద్వాల్), జి.కృష్ణ ప్రసాద్(లీడింగ్ ఫైర్ ఫైటర్, వైరా), ఎస్.రాజేశ్వర్(ఫైర్ ఫైటర్ టెక్నికల్, హయత్‌‌‌‌‌‌‌‌నగర్), వి.రాంబాబు(ఫైర్ ఫైటర్ టెక్నికల్, ఖమ్మం), కె.వినోద్ కుమార్(ఫైర్ ఫైటర్ టెక్నికల్, స్నార్కెల్), ఎం.ప్రవితన్(ఫైర్ ఫైటర్, గౌలిగూడ), జి.రాకేశ్​కుమార్(ఫైర్ ఫైటర్, హైకోర్టు), జె.వెంకటేశ్వర్లు(ఫైర్ ఫైటర్, హుజూర్​నగర్).