V6 News

బీసీ మహిళల హక్కులు మోదీకి కనబడవా? : దాసు సురేశ్  

బీసీ మహిళల హక్కులు మోదీకి కనబడవా? : దాసు సురేశ్  
  • బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్  

ముషీరాబాద్, వెలుగు: దేశ రాజకీయాల్లో వెనుకబడిన వర్గాల నుంచి ఎదిగానని చెప్పుకుంటున్న ప్రధానమంత్రికి బీసీ  మహిళల హక్కులు ఎందుకు కనబడడం లేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ ప్రశ్నించారు. బీసీ వ్యతిరేక విధానాలపై గురువారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.

మహిళల హక్కులను విస్మరిస్తున్న ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు. మహిళా రిజర్వేషన్లు ఉన్నత వర్గాల మహిళలకు కలిసి వచ్చే విధంగా  కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే అది బీసీ సమాజానికి అన్యాయం చేసినట్లే అవుతుందన్నారు.