- విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని, అందులో భాగంగా గౌరిగుండాల జలపాతాన్ని రూ. 6 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గౌరిగుండాల జలపాతం అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబితం గ్రామం సమీపంలో గట్టు సింగారం కొండల నుంచి ప్రవహించే నీటితో జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నుగుళ్ల మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి, సర్పంచులు, కొమ్ము సుజాత, నూనె సరోజన, కాంగ్రెస్ లీడర్లు, అధికారులు పాల్గొన్నారు.
