ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌‌‌‌మెంట్ కోటా స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్

ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌‌‌‌మెంట్ కోటా స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్, ఆర్మీ డెంటల్ కాలేజీల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి మేనేజ్‌‌‌‌మెంట్ కోటా (బీ, సీ/ఎన్ఆర్ఐ) ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత రౌండ్‌‌‌‌లో సీట్లు పొంది చేరని 23 మంది వివరాలతో పాటు ఖాళీ సీట్లు, 1,980 మందితో కూడిన ఫైనల్ మెరిట్ లిస్టును వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉంచింది.

అర్హులైన అభ్యర్థులు గురువారం(12న) ఉదయం 11 గంటల వరకు https://tspvtmedadm.tsche.in/ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.  సీటు అలాట్ అయినవారు వర్సిటీ ఫీజు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చెల్లించి అలాట్‌‌‌‌మెంట్ ఆర్డర్ పొందాలి. బీ కేటగిరీ ఎంబీబీఎస్‌‌‌‌కు రూ.లక్ష, బీడీఎస్‌‌‌‌కు రూ.40 వేలు ఫీజు చెల్లించాలి. సీ/ఎన్ఆర్ఐ కేటగిరీ ఎంబీబీఎస్‌‌‌‌కు రూ.2 లక్షలు, బీడీఎస్‌‌‌‌కు రూ.80 వేలు చెల్లించాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, కాలేజీ ట్యూషన్ ఫీజుతో నవంబర్ 16లోపు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సీటు అలాటైన తర్వాత చేరకపోతే 20 లక్షల జరిమానాతో పాటు వర్సిటీ నుంచి మూడేళ్లపాటు డిబార్ చేస్తారు.