అక్రమంగా దేశంలో ఉంటున్నారనిఫ్లైట్ ఎక్కుతుండగా లాక్కెళ్లారు! 

అక్రమంగా దేశంలో ఉంటున్నారనిఫ్లైట్ ఎక్కుతుండగా లాక్కెళ్లారు! 
  • అమెరికాలోని సియాటిల్ ఎయిర్​పోర్టులో కలకలం
  • ఇద్దరు మెక్సికన్లను అరెస్టు చేసిన ఇమిగ్రేషన్‌‌‌‌ ఆఫీసర్లు 

వాషింగ్టన్‌‌‌‌: అమెరికాలోని సియాటిల్‌‌‌‌–టకోమా ఎయిర్​పోర్టులో అధికారులు ఇద్దరు ప్రయాణికులను బలవంతంగా అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ముసుగులు ధరించిన ఇద్దరు ఇమిగ్రేషన్‌‌‌‌ ఆఫీసర్లు విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు ప్యాసింజర్స్​ను జెట్‌‌‌‌ బ్రిడ్జిపై అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏర్పడిన ఉద్రిక్తత, ఇద్దరిలో ఓ మహిళ అధికారుల కాళ్లు పట్టుకుని ‘మాకు వర్క్‌‌‌‌ పర్మిట్‌‌‌‌ ఉంది. అన్యాయంగా అరెస్ట్​ చేస్తున్నారు’ అంటూ వేడుకుంటున్న వీడియోలు వైరల్​గా మారాయి. ఒక వ్యక్తిని కిందపడేసి అదుపులోకి తీసుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం అలాస్కా ఎయిర్‌‌‌‌లైన్స్‌‌‌‌ ఫ్లైట్​లో బోర్డింగ్​ సమయంలో ఈ ఘటన జరిగింది. 

వీసా గడువు దాటినందుకే అరెస్ట్‌‌‌‌

మెక్సికోకు చెందిన రికార్డో లరొండో మెండోజా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో  ఉంటున్నాడని సమాచారం అందిందని, దీంతో తనిఖీలు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నామని ​ అధికారులు తెలిపారు. మరో మహిళ సోఫియా హెర్నాండెజ్‌‌‌‌ మెజియా అధికారులపై వేడి కాఫీ విసిరినట్లు తెలిపారు. ఆమె కూడా మెక్సికో సిటిజన్ అని, ఆమె వీసా గడువు కూడా దాటినందున అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.