జూబ్లీహిల్స్, వెలుగు: దండులూరి నళిని మోహన్ రచించిన మాస్టర్ యువర్ ఫ్యూచర్– ఎ గైడెడ్ ఫ్రేమ్‌వర్క్ ఫ్రమ్ పొటెన్షియల్ టు ఎక్సలెన్స్ అనే పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ఆవిష్కరించారు. యువతకు మార్గదర్శిగా ఈ బుక్నిలుస్తుందన్నారు.
వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు, వృత్తిపరమైన విజయానికి ఆధ్యాత్మిక, సామాజిక విలువలను మేళవించడం రచయిత ప్రత్యేకత అని కొనియాడారు. ఇదే వేదికపై సాహిత్య, వృత్తిపరమైన సేవలకు గానూ నళిని మోహన్‌కు రెండు ప్రతిష్ఠాత్మక మెమోరియల్ అవార్డులను అందజేసి సత్కరించారు.
