అత్యధిక పన్ను చెల్లింపుదారుడినన్న ఫీలింగ్ చాలా బాగుంది

అత్యధిక పన్ను చెల్లింపుదారుడినన్న ఫీలింగ్ చాలా బాగుంది

పన్నులు చెల్లించడంలో ఎప్పుడూ నిరాడంబరతను చాటుకునే సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌ ఈ సారి కూడా అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ కూడా ఇటీవలే ఓ హానర్ సర్టిఫికెట్ తో అక్షయ్ ను గౌరవించింది. ఈ విషయంపై నటుడు అక్షయ్ కుమార్ స్పందించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారునిగా గుర్తించినందుకు తనకు నిజంగా చాలా గౌరవంగా, సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు క్రెడిట్ ఇవ్వడం గొప్ప అనుభూతిని కలిగించిందని అక్షయ్ చెప్పారు. అలాగే..‘మీరు సంపాదించిన దాన్ని తిరిగి దేశానికి ఇవ్వడం మంచిది’ అని సూచించారు. 

2015, 2019లో అక్షయ్ కుమార్ ప్రపంచంలోనే అత్యధికంగా చెల్లించే ట్యాక్స్ పేయర్ గా ఫోర్బ్స్ జాబితాలో USD 48.5 మిలియన్ (సుమారు రూ. 386 కోట్లు) సంపాదనతో 52వ స్థానంలో ఉన్నారు. సినిమాలే కాకుండా అక్షయ్ ఆదాయానికి ప్రధాన వనరు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కూడా వస్తుంది. ఇక ఇటీవల ఆదాయపు పన్ను శాఖ సత్కరించిన తర్వాత.. అక్షయ్ అభిమానులు ఆయన్ని "బాధ్యత గల పౌరుడు" గా అభివర్ణించారు.