సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఎంజాయ్ చేయడం పక్కా

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఎంజాయ్ చేయడం పక్కా

శివాజీ,  లయ  జంటగా సుధీర్ శ్రీరామ్ రూపొందించిన చిత్రం   ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.  90'స్ వెబ్ సిరీస్‌‌లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్‌‌తో పాటు ప్రిన్స్,  అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీ  కీలకపాత్రలు పోషించారు. శివాజీ నిర్మించగా, ఈటీవీ విన్‌‌లో    ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా  హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ట్రైలర్  సూపర్‌‌‌‌గా ఉంది.  చాలా నవ్వుకున్నా.  

డైరెక్టర్ సుధీర్ రైటింగ్,  ప్రెజెంటేషన్  బాగుంది. సినిమా చూసిన   ప్రేక్షకులంతా ఎంజాయ్ చేయడం పక్కా’ అని చెప్పాడు.  ఈ  చిత్రం అందరికీ నచ్చుతుందని, సపోర్ట్ చేసిన వారందరికీ శివాజీ థ్యాంక్స్ చెప్పాడు.  తాను పోషించిన ఉత్తర పాత్రను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని లయ చెప్పింది.  డైరెక్టర్ సుధీర్ మాట్లాడుతూ ‘శివాజీ, లయ,  ఆలీ  లాంటి  సీనియర్స్‌‌తో   కలిసి పనిచేయడం  అదృష్టంగా భావిస్తున్నా.  నాకు అవకాశం ఇచ్చిన శివాజీ గారికి స్పెషల్ థ్యాంక్స్’ అని అన్నాడు. నటులు అలీ, ధనరాజ్, బాల నటుడు రోహన్, ఈటీవీ విన్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.