ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.1.15 కోట్లు 

ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూ.1.15 కోట్లు 

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.15 కోట్లు మంజూరు చేసినట్లు విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఈ సందర్భంగా నిధులు శాంక్షన్ చేయించిన ఎమ్మెల్యేను ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఆయన నివాసంలో ఆలయ పాలక మండలి సభ్యులు మంగళవారం సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నిధులతో సీసీ రోడ్లు, టాయిలెట్స్ నిర్మిస్తామన్నారు.

పనులను త్వరలో చేపట్టి జూన్‌‌‌‌లోగా పూర్తి చేస్తామన్నారు. ఆలయ ఆవరణలో లైటింగ్ సిస్టం కోసం మరో రూ. 20 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. పాలకమండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, డైరెక్టర్లు సమ్మిరెడ్డి, శ్రావణ్ కుమార్, రవీందర్, కె.శ్రీనివాస్, రాజారామ్, టి.శ్రీనివాస్, రవికుమార్, రమేశ్‌‌‌‌, యమున, ఈవో సదయ్య, తదితరులు పాల్గొన్నారు.