జగిత్యాల జిల్లాలో విధులపట్ల నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా సెలవులో వెళ్లిన కథలాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ అలీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల జిల్లా కథలాపూర్ అటవీశాఖలో సెక్షన్ అధికారిగా ముస్తాక్ అలీ పనిచేస్తున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా సెలవులో ఉన్నాడు. సెలవులకోసం ముందస్తు పర్మిషన్ లేకుండా 19 రోజులు సెలవులో వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేపట్టిన ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు .. ముస్తాక్ అలీని సస్పెండ్ చేశారు.
