104 మంది డిగ్రీ లెక్చరర్లకు ప్రమోషన్

104 మంది డిగ్రీ లెక్చరర్లకు ప్రమోషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 104 మంది లెక్చరర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. 14 ఏండ్ల బోధన సేవలు, పరిశోధన అనుభవం ఆధారంగా వీరిని ఎంపిక చేశారు. మల్టీజోన్ 1 నుంచి 50 మంది, మల్టీజోన్ 2 నుంచి 54 మంది ఉన్నారు. సకాలంలో ప్రమోషన్లు కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బ్రిజేష్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా, కమిషనర్ శ్రీదేవసేనకు ధన్యవాదాలు తెలిపారు.