తల్లికి షాకిచ్చిన 13 ఏళ్ల బాలిక.. .4 నెలల్లో రూ.15 లక్షలు గోవిందా..

తల్లికి షాకిచ్చిన 13 ఏళ్ల బాలిక.. .4 నెలల్లో రూ.15 లక్షలు గోవిందా..

ఆన్ లైన్ గేమ్స్ కు బానిస అవుతూ చాలా మంది పిల్లలు మానసిక రోగాలకు గురవుతున్నారు. కొంత మంది ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లిపోతున్నారు. ఇంతలా గేమ్స్ పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి.  కాని ఇప్పుడు చైనాలో ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన ఓ బాలిక ఏకంగా తల్లికి పెద్ద షాక్ ఇచ్చి..  అకౌంట్ లో డబ్బులను స్వాహా చేసింది. 

మొబైల్ గేమ్స్కు బానిస

వివరాల్లోకి వెళితే.. .చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న 13 ఏళ్ల బాలిక  మొబైల్ గేమ్‌లకు బానిసైంది. కేవలం ఫోన్‌లో గేమ్‌లు ఆడేందుకు తన తల్లి ఖాతా నుంచి లక్షల రూపాయలను కొల్లగొట్టింది.అయుతే  బాలిక టీచర్ మందలించకపోతే  ఈ విషయం తల్లికి కూడా తెలిసి ఉండేది కాదు

పే టు ప్లే గేమ్స్

స్కూల్‌లో ఆ బాలిక ఎక్కువ సమయం మొబైల్‌తో బిజీగా ఉండేది. స్కూల్ టీచర్ నిత్యం ఫోన్‌లో బిజీగా ఉండడం చూసి బాలిక గేమ్‌కు బానిసైందని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని బాలిక తల్లికి  టీచర్ చెప్పడంతో తల్లి ఆమె ఖాతాను తనిఖీ చేసింది.  ఆమె  బ్యాంక్ బ్యాలెన్స్‌లో కొన్ని యువాన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.  ఇక అంతే ఆ తల్లికి దిమ్మ తిరిగిపోయింది.  అమ్మాయి పే టు ప్లే గేమ్‌లకు అలవాటు పడిందని, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేందుకు అన్ని లావాదేవీలు జరిపిందని బ్యాంక్ స్టేట్‌మెంట్ వెల్లడించింది.

స్నేహితుల కోసం కూడా గేమ్స్ కొనుగోలు

బాలిక తండ్రి   గట్టిగా అడగగా.. గేమ్ కొనుగోలు చేసేందుకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తేలింది. తనకు డబ్బు గురించి పెద్దగా తెలియదని బాలిక చెప్పింది. అతను తన తల్లి డెబిట్ కార్డ్‌  పాస్ వర్డ్ ..  అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి  చెప్పింది. దానిని ఆ యువతి తన స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసింది. ఆమె తన కోసం ఆటలను కొనుగోలు చేసింది.  అంతేకాదు  తన 10 మంది క్లాస్‌మేట్స్ కోసం కూడా  గేమ్‌లను కొనుగోలు చేసింది. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి షాకిచ్చిన 13 ఏళ్ల బాలిక 

మొబైల్ ఫోన్ వల్ల లాభాలు ఉంటే, అలాంటి అనేక నష్టాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ నష్టం జరిగింది అని తెలిసేంత వరకు మనకు తెలియదు. చిన్న  పిల్లలు  మొబైల్ గేమ్‌లకు అలవాటు పడితే ఆ నష్టాన్ని పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా భరించాల్సిందే. చైనాలో అలాంటిదే జరిగింది, అక్కడ 13 ఏళ్ల బాలిక తన కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చింది.