హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • పైలట్ సహా ముగ్గురికి స్వల్ప గాయాలు

చికాగో: అమెరికాలోని చికాగోలో హైవేపై ఒక చిన్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు పైలట్ జేసన్ ఎం.బఫ్టన్ (39) చెబుతున్నాడు. పైలట్ తోపాటు మరో ముగ్గురు ఈ చిన్న విమానంలో ప్రయాణిస్తున్నారు. గురువారం జరిగిన సంఘటనపై ఇల్లినాయిస్ స్టేట్ పోలీసుల కథనం ప్రకారం వెటరన్స్ మెమోరియల్ టోల్‌వే యొక్క సౌత్‌బౌండ్ సందుల్లో ఒక చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ముగ్గురు గాయపడ్డారు. ఫ్లైట్అవేర్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, 1975 వైట్ బీచ్ బి 24 ఆర్ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం, లూయిస్ విశ్వవిద్యాలయ విమానాశ్రయం నుండి బయలుదేరిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఇంజిన్ లో ట్రబుల్ ఏర్పడింది. దీంతో అత్యవసరంగా హైవేపై ల్యాండింగ్ చేశాడు. ఇండియానాపోలిస్‌లో భోజనం చేయడానికి వీరు వెళ్తుండగా ఘటన జరిగినట్లు చెప్పారు. బుల్లి ఎయిర్ క్రాఫ్ట్ విమానం పైలట్ జాసన్ ఎం.బఫ్టన్ (39)తోపాటు, విమానంలో ఉన్న క్రిస్టిన్ మెక్ కిమ్ (21),పైజీ ఎం.బఫ్టన్ (20), మరో 15 ఏళ్ల బాలిక వీరంతా వెల్మింగ్టన్ కు చెందిన వారుగా గుర్తించారు. విమానం హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంగా తీవ్ర కుదుపులకు గురికావడంతో గాయపడ్డారు. ఎవరికీ ప్రాణహాని లేదు. కానీ తీవ్రమైన మెడ, ఒళ్లు నొప్పుల సమస్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వీరందరినీ సమీపంలోని ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు.