అమెజాన్ అడవుల్లో అద్భుతం.. కూలిన విమానం.. 40 రోజుల తర్వాత దొరికిన చిన్నారులు

అమెజాన్ అడవుల్లో అద్భుతం.. కూలిన విమానం.. 40 రోజుల తర్వాత దొరికిన చిన్నారులు

కొలంబియాలోని కాక్వెటా రాష్ట్రంలోని సోలానో జంగిల్ లో జరిగిన ఘోరమైన విమాన ప్రమాదంలో తప్పిపోయిన నలుగురు స్వదేశీ పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. కొలంబియా సైనికులచే వారు సజీవంగా గుర్తించడానికి ముందు 40 రోజుల పాటు వారు అడవిలోనే సంచరించారు. జూన్ 9న వెల్లడైన రెస్క్యూ ప్రకటన ప్రకారం ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నారు, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల బృందం తమ తల్లితో కలిసి అమెజానియన్ గ్రామం అరరాకురా నుండి శాన్ జోస్ డెల్ గువియార్‌కు వెళ్తుండగా విమానం కూలిపోయింది

క్యూబా నుంచి బొగోటాకు తిరిగి వచ్చిన ఆ దేశాధ్యక్షులు గుస్తావో పెట్రో.. ఈ విషయంపై మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందంపై నేషనల్ లిబరేషన్ ఆర్మీ రెబల్ గ్రూఫ్ ప్రతినిధులతో సంతకం చేశారు. యువకుడు మనుగుడకు ఇదొక ఉదాహరణ అన్న గుస్తావో.. ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

ఏడుగురు ప్రయాణికులతో పాటు ఓ పైలట్ ప్రయాణిస్తోన్న ఓ సెస్నా ఇంజిన్ ప్రొపెల్లర్ విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ లో వైఫల్యం కారణంగా భూమిపై పడిపోయింది. చిన్న విమానం కావడంతో కొద్దిసేపటికే రాడార్ నుంచి పడిపోయింది. అనంతరం ప్రాణాలతో బయటపడిన వారి కోసం అధికారులు అన్వేషించడం మొదలుపెట్టారు. మే 1న తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగగా.. రెండు వారాల తర్వాత అంటే మే 16న ఓ సెర్చింగ్ టీం దట్టమైన అమెజాన్ అడవుల్లో విమానాన్ని కనుగొంది. విమానంలో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు. కానీ అందులో ఉన్న పిల్లల ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ ఘటనతో వారు బతికే ఉన్నారని అధికారులు భావించారు. ఆ తర్వాత 13, 9, 4, 11 నెలల వయసున్న నలుగురు తోబుట్టువులను ట్రాక్ చేయడానికి కొలంబియా 150మంది సైనికులను అడవికి పంపించింది. వారిని గుర్తించేందుకు సైనికులు స్థానిక తెగల ప్రజలు, వాలంటీర్ల సహాయం కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారు వెంట తీసుకెళ్లిన రెస్క్యూ కుక్కల ద్వారా జూన్ 9న థర్మల్ దుప్పట్లలో చుట్టబడిన పిల్లలను సైన్యం గుర్తించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. పిల్లల ఫొటోలను కూడా ట్వీట్ చేసింది. పిల్లలు దొరికినప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎంత దూరంలో ఉన్నారో మాత్రం అధికారులు చెప్పలేదు.