టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 41 వేలు దాటింది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ గుట్టలుగా శవాలు బయట పడుతున్నాయి. సంఘటన జరిగి 12 రోజులైనా సహాయ చర్యల్ని ఇంకా కొనసాగిస్తున్నారు. గడ్డకట్టే చలిలోనూ శిథిలాల కిందనుంచి ప్రాణాలతో పోరాడుతున్నవాళ్లను బయటకు తీస్తున్నారు. టర్కీలో శుక్రవారం హకన్ యాసినోగ్లు అనే 45 ఏళ్ల వ్యక్తిని శిథిలాలనుంచి బయటికి తీశారు. కొనఊపిరితో ఉన్న అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గురువారం అర్థరాత్రి 14 ఏళ్ల బాలుడిని రెస్క్యూ టీం కాపాడింది.
