
ఇరాక్‌లోని అల్-కుట్ సిటీలో హైపర్‌మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మంది మరణించగా, చాల మంది గాయపడ్డారు. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో అల్-కుట్‌లోని ఐదు అంతస్తుల భవనంలో నిన్న రాత్రిపూట మంటలు చెలరేగుతుండటం చూడొచ్చు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఈ అగ్నిప్రమాదానికిగల కారణలు తెలియరాలేదు. అయితే దర్యాప్తు జరుగుతుందని 48 గంటల్లో ప్రమాదానికి కారణాలు ప్రకటిస్తామని అక్కడి గవర్నర్ చెప్పారు.
#BREAKING Fifty people were killed in a massive fire in a hypermarket in al-Kut city in eastern Iraq
— Guy Elster גיא אלסטר (@guyelster) July 17, 2025
pic.twitter.com/3r2d3Gx9Cv