
- భర్తీకి రెండుమూడ్రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో 931 ఇంజనీర్ పోస్టుల భర్తీకి రెండు, మూడ్రోజుల్లో ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానున్నాయి. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 704, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 227 ఉన్నాయి. ఏఈఈ విభాగంలో సివిల్ ఇంజనీర్ పోస్టులు 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ పోస్టులు వంద ఉన్నాయి. మల్టీ జోన్ -1లో 259, మల్టీ జోన్ -2లో 445 ఏఏఈ పోస్టులున్నాయని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో సివిల్ 182, మెకానికల్ పోస్టులు 45, మల్టీజోన్ -1లో 112, మల్టీ జోన్ -2లో 115 భర్తీ చేస్తారు.