కొండా వర్సెస్ చల్లా.. మాటల యుద్ధం

కొండా వర్సెస్ చల్లా.. మాటల యుద్ధం
  • ఆ భాష పల్లెటూరోళ్లు కూడా వాడరు

హనుమకొండ జిల్లా: మాజీ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పరస్పరం విమర్శలకు దిగారు. హన్మకొండ జిల్లా ఆగ్రంపహాడ్ లో కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో కూల్చేశారు టీఆర్ఎస్ నాయకులు. అయితే కొండా మురళి తల్లిదండ్రుల స్థూపం ధ్వంసానికి తనకు సంబంధం లేదని ప్రకటించారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ‘కొండా సురేఖది మూర్ఖత్వమా ? అజ్ఞానమా ?  పవిత్రమైన ప్రదేశాల్లో నికృష్ణమైన వాతావరణ తీసుకొచ్చారు కొండా సురేఖ వాడిన భాష ...పల్లెటూరివాళ్లు కూడా వాడరు. కొండా సురేఖది నోరా తాటిమట్టా...? సింహాం నిద్రలేసుడేందీ...? లేవలేక చాతకాకనే పోతిరి.. వెయ్యితప్పులు చేసింది మీరు, అందుకే ప్రజలకు దూరమయ్యారు’ అని చల్లా ధర్మారెడ్డి అన్నారు. 
పడగొట్టమని చెప్పి.. సంబంధం లేదనడం సిగ్గులేనితనం: కొండా సురేఖ
అయితే చల్లా ధర్మారెడ్డి కామెంట్స్ పై  మాజీమంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.  పైర్ అయ్యారు. స్థూపం పడగొట్టండి అని చెప్పి..మళ్లీ సంబంధం లేదనడం సిగ్గులేనితనానికి నిదర్శనమని విమర్శించారు. ‘భాష గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడే అర్హత చల్లా కు లేదు. స్థూపం పెట్టినంక మేము నాశనం కాదు, రెండు సార్లు గెలిచాము. సింగారం బ్రిడ్జికట్టకపోతే నువ్వు కాంట్రాక్టర్ వు ఎలా అయ్యేవాడివో తెలుసుకో. మీదౌర్జన్యాలకు ప్రజలు లోలోన కుమిలిపోతున్నారు..’ అని కొండా సురేఖ అన్నారు. 
 

 

ఇవి కూడా చదవండి

మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం