అభివృద్ధి జరిగే డివిజన్లకు రూ. 50 లక్షల ప్రోత్సాహం 

అభివృద్ధి జరిగే డివిజన్లకు రూ. 50 లక్షల  ప్రోత్సాహం 

వరంగల్ : సరిగా పనిచేయని సర్పంచ్ లపై చర్యలు తీసుకున్నట్టే.. సరిగ్గా పనిచేయకపోతే కార్పొరేటర్లపైనా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా పనిచేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా.. బాగా పనిచేసిన 5 డివిజన్లను ఎంపిక చేసి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. సరిగా పనిచేయకపోతే చర్యలు తప్పవన్నారు. అధికార పార్టీలో ఉన్నామని తన దగ్గరకు వచ్చినా ఉపయోగం ఉండబోదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అధికారం మొత్తం కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ దగ్గే ఉందన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

వరంగల్, హన్మకొండ జిల్లాల పేర్లు మార్పు కోసం వారం రోజుల్లో జీవో వస్తుందని ఎర్రబెల్లి తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రం కోసం అజాంజాహి మిల్ గ్రౌండ్, ఆటో నగర్ అనే పేర్లు పరిశీలిస్తున్నామని.. రాజకీయాలకు అతీతంగా వరంగల్ కార్పొరేషన్ లో ప్రతి డివిజన్ అభివృద్ధి కావాలన్నారు. హైదరాబాద్ లాగే వరంగల్ అభివృద్ధి చెందాలని..జులై ఒకటి నుంచి జరిగే పట్టణ ప్రగతిని సవాల్ గా తీసుకోవాలన్నారు. నగర కార్పొరేటర్లు అంతా ఇందులో భాగమై ప్రతి డివిజన్ ను అభివృద్ధి చేసుకోవాలని..పట్టణ ప్రగతిలో బాగా పని చేసిన 5 డివిజన్లను ఎంపిక చేసి, రూ. 50 లక్షల చొప్పున ప్రోత్సాహం  ఇస్తామన్నారు. కొత్త మున్సిపల్ చట్టంలో  పనిచేయని కార్పొరేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.