- బ్రహ్మోత్సవాలకు రావాలని ఎంపీ, ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఆమనగల్లు, వెలుగు : తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ శుక్రవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ఆలయ ధర్మకర్త, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసమూర్తి నాయకులతో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 9 నుంచి 11 వరకు లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
అంతకుముందు ఎమ్మెల్యే బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఎంపీ, ఎమ్మెల్యేను కలిసిన వారిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటరెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్చార్జి మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఉన్నారు.
