బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ముందుకొస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతోన్న ‘లెనిన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కృష్ణ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం నుంచి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు ఆమె క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్.
‘వారెవ్వా వారెవ్వా.. ఎన్నెలల్లే ఉంటాది మా భారతి..’ అంటూ ఇందులో భారతి పాత్రలో భాగ్యశ్రీ కనిపించబోతోందని తెలియజేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లంగా ఓణీ కట్టుకుని ట్రెడిషినల్ గెటప్‌లో ఇంప్రెస్ చేస్తోంది. జాతర బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న లుక్ ఆకట్టుకుంది.
జనవరి 5న ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఎమోషనల్ లవ్ స్టోరీతో కూడిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
