మున్సిపల్‌‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి : మాజీ మున్సిపల్‌‌ చైర్మన్‌‌ కంచెట్టి గంగాధర్‌‌

మున్సిపల్‌‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి : మాజీ మున్సిపల్‌‌ చైర్మన్‌‌ కంచెట్టి గంగాధర్‌‌

ఆర్మూర్‌‌, వెలుగు : రానున్న మున్సిపల్‌‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు  ఆర్మూర్‌‌ మాజీ మున్సిపల్‌‌ చైర్మన్‌‌ కంచెట్టి గంగాధర్‌‌ పిలుపునిచ్చారు.  శుక్రవారం ఆర్మూర్‌‌లో బీజేపీ టౌన్‌‌ అధ్యక్షుడు మందుల బాలు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  మున్సిపల్‌‌ ఎన్నికల ఓటర్‌‌ లిస్టుల్లో ఉన్న తప్పులు, బోగస్‌‌ ఓట్ల తొలగింపుపై చర్చించారు. బోగస్‌‌ ఓట్లు, స్థానికంగా నివసించని వారి ఓట్లను గుర్తించి వెంటనే తొలగించేలా కార్యాచరణ ప్రారంభించాలని, అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. 

సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, జిల్లా కార్యదర్శి పోల్కం వేణు, యామాద్రి భాస్కర్‌‌, ఆకుల శ్రీనివాస్‌‌, ద్యాగ ఉదయ్‌‌, కలిగోట గంగాధర్‌‌, తిరుపతి నాయక్‌‌, ఖాందేశ్‌‌ ప్రశాంత్‌‌, జాగిర్ధార్‌‌ శ్రీనివాస్‌‌, సుంకరి రంగన్న, ఆకుల రాజు, దోండి ప్రకాష్‌‌, బాండ్లపల్లి నర్సారెడ్డి, విజయానంద్‌‌, కుక్‌‌నూర్‌‌ లింగన్న, పిట్ల శ్రీధర్‌‌, ఉదయ గౌడ్‌‌, శేఖర్‌‌, పులి యుగంధర్‌‌, కుమార్‌‌, అల్జాపూర్‌‌ రాజేష్‌‌, గోపి, మిరియాల కిరణ్‌‌, దక్షిణమూర్తి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.