- సామాజిక వేత్త బక్క జడ్సన్ డిమాండ్
సిద్దిపేట టౌన్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సామాజిక వేత్త బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఈనెల 5న రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇవ్వాలనే డిమాండ్ తో నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ వాల్ పోస్టర్ ను సంఘం నేతలతో కలిసి సిద్దిపేటలో శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగ విరమణ పొంది రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు రిటైర్ మెంట్ బకాయిలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు భారీగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. బకాయిలు రాక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 42 మంది మరణించారని, అయినా.. రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొన్నమల్ల రాములు, నేతలు పాల్గొన్నారు.
