- ఫోన్ ట్యాపింగ్‌తో వ్యాపారులను బెదిరించారు: అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో వ్యాపారులను బెదిరించి పార్టీ ఫండ్ వసూలు చేసింది నిజం కాదా అని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ఏమీ దేశం కోసం పోరాటం చేయలేదు. ఆధారాలు లేకుండా విచారణకు సిట్ పిలవదు”అని మంత్రి స్పష్టం చేశారు.
తప్పు చేయకపోతే భయం ఎందుకు: వాకిటి
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. విచారణకు అటెండ్ కావటానికి కార్ల కాన్వాయ్ ఎందుకని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చెప్పుకోవటానికే సిగ్గుచేటని, హత్య కంటే పెద్ద నేరమని విమర్శించారు. ఆదివారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ట్యాపింగ్ బాగోతం అందరికీ తెలియజేయడానికి కార్లతో ర్యాలీలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మీరు నిజాయితీపరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేదన్నారు.
