రూ. 15 కోట్లకు మోసం చేసిన హైటెక్ సిటీలోని అగ్రిటెక్​ కంపెనీ

రూ. 15 కోట్లకు మోసం చేసిన హైటెక్ సిటీలోని అగ్రిటెక్​ కంపెనీ
  •  ఐటీ కారిడార్​లో బోర్డు తిప్పేసిన ల్యాబ్​ టూ ల్యాండ్’​ కంపెనీ
  • సైబరాబాద్​ పోలీసులకు బాధితుల ఫిర్యాదు.. ఇద్దరు డైరెక్టర్లపై కేసు

గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్​లో ఓ అగ్రి కల్చర్​ బేస్డ్​ కంపెనీ బోర్డు తిప్పేసింది. కెమికల్స్​ స్టాక్​ పేరుతో రెండు తెలుగు రాష్ర్టాల్లో రూ. 15 కోట్ల  ఫ్రాడ్ చేసింది. ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు.  కంపెనీ మేనేజ్ మెంట్ పారిపోయింది. దీంతో బాధితులు గురువారం సైబరాబాద్ ​పోలీసులకు కంప్లయింట్ చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. రాయదుర్గం నాలెడ్జ్​సిటీలోని టీ హబ్​లో ల్యాండ్ ​టూ ల్యాబ్​అగ్రిటెక్ ​సొల్యూషన్స్​ కంపెనీ ఉంది. 

ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్, క్రాప్ ​న్యూట్రీషన్, న్యూ కెమికల్ ఇన్నోవేషన్స్​వంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమను నడుపుతుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో పలువురు డీలర్లకు వ్యవసాయ సంబంధిత రూ. 50వేల చొప్పున కెమికల్​ స్టాక్ ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ. 5 లక్షలు వసూలు చేసింది. డీలర్స్ ​స్టాక్​, డబ్బులపై కంపెనీ మేనేజ్ మెంట్ ను నిలదీస్తే తప్పించుకొని తిరుగుతున్నారని బాధితులు వాపోయారు.  

ALSO READ :- Allu Arjun Wax statue: గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

సుమారు 500 మంది డీలర్లు ఉన్నట్లు, దాదాపు 15 కోట్లపైగా చీటింగ్​ చేసినట్లు  ఆరోపించారు.  సీఈఓ ఆదిత్య దేశ్​పాండే తప్పించుకొని తిరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు.  బాధితుల  కంప్లయింట్ తో కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్టు రాయదుర్గం పోలీసులు తెలిపారు.