39 మందితో సీడబ్ల్యూసీ.. ఏపీ నుంచి రఘవీరారెడ్డి.. తెలంగాణకు దక్కని ఛాన్స్

39 మందితో సీడబ్ల్యూసీ..  ఏపీ నుంచి రఘవీరారెడ్డి.. తెలంగాణకు దక్కని ఛాన్స్

 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని (సీడబ్ల్యూసీ) ఇవాళ( ఆగస్టు 20)  39 మందితో ఖర్గే  ఏర్పాటు చేశారు. అయితే సీడబ్య్యూసీ తెలంగాణకు ప్రాధాన్యత దక్కలేదు.  తెలుగు రాష్ట్రాల నుంచి రఘవీరారెడ్డికి చోటు దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు, ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మంది నేతలను నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఏపీ నేతలు  పల్లం రాజు, వంశీ చందర్ రెడ్డి, శాశ్వత ఆహానితులుగా  సుబ్బి రామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజ నరసింహాలకు స్థానం దక్కింది.ఇక కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులుగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఖర్గే ,సచిన్‌ పైలట్‌ , దిగ్విజయ్‌సింగ్‌ ,శశిథరూర్‌ , అధిరంజన్‌,జితేంద్రసింగ్‌ , అశోక్‌ చవాన్‌ , దీపక్‌ బవారియాకు చోటు దక్కింది.  సీడబ్ల్యూసీలో ఏపీ నుంచి రఘువీరారెడ్డికి చోటు దక్కింది. 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . సీడబ్ల్యూసీలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణను చిన్న చూపు చూశారు. ఎన్నికలు ఉన్న సమయంలో కీలక నేతలకు అవకాశాలు దక్కుతాయని భావించినా వీరికి కమిటీ ఛాన్స్ ఇవ్వలేదు. కేవలం శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు.  తెలంగాణలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ ఎవ్వరినీ ప్రకటించలేదు. తెలంగాణ పై ఎందుకు వివక్ష చూపారని అందరూ చర్చించుకుంటున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, సంపత్, దామోదర రాజనరసింహకు ఛాన్స్ ఇస్తారని ఆశించారు. అయితే దామోదర నరసింహకి శాశ్వత ఆహ్వానితులుగా ప్రకటించడం గమనార్హం.