Health tips: మీ ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పది అలవాట్లను మానుకోండి

Health tips: మీ ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పది అలవాట్లను మానుకోండి

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు..ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శరీరంలో ఏ ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకున్నా ఆనారోగ్యానికి గురి కావాల్సిందే..ఇబ్బందులు పడకతప్పదు.. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెయిన్​,జీర్ణ వ్యవస్థలోని లివర్​, జీర్ణాశయం,పెద్ద ప్రేగులు ఇలా అంతర్గత అవయవాల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం  జీవించే విధానం, మనం తీసుకునే ఆహారం, అలవాట్లు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. మన అలవాట్లు తప్పకుండా మార్చుకోవాల్సిందే.. శరీర ఆరోగ్యంలో కీలకం పెద్ద ప్రేగు ఆరోగ్యం.. దీనిని కాపాడుకోవాలంటే ఉదయాన్ని  ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకుందాం.. 

రోజు మనం మొదట తీసుకునే అల్పాహారం ఎంపిక, ఎంత ముఖ్యమో ఉదయం సమయం కూడా అంతే ముఖ్యమైంది. ఎందుకంటే రోజు మొత్తం మనం చేసే పనుల విభజన, ఏవిధంగా చేయాలి.. ఎంత వేగంతో చేయాలి.. సరిపడా శక్తి ఇలాంటి కీలకమైన అంశాలను నిర్ణయించే టైం అన్నమాట. తప్పుడు నిర్ణయాలు మీ మానసిక స్థితిని దెబ్బతీయొచ్చు. ఆరోగ్యాన్ని దిగజార్చవచ్చు. అందుకే ఉదయాన్ని లేవగానే కొన్ని  హ్యాబిట్స్​ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.

నిద్ర లేచిన వెంటనే మీ ఫోన్‌ను ఉపయోగించడం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న భోజనం తినడం, ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వంటివి మీరు రోజంతా మీ శక్తి స్థాయిలను ప్రభావితం చేసి  మీ పేగు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్లే చెబుతున్నారు. మన రోజువారి జీవితాన్ని ప్రభావితం చేసే 10 అలవాట్లను షేర్ చేశారు AIIMS, స్టాన్‌ఫోర్డ్ ,హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి.. మనమందరం సాధారణంగా ఆచరించే కొన్ని అలవాట్లను హైలైట్ చేశారు.అవి మన శక్తిని,పేగు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేయడానికి కారణమవుతాయంటున్నారు సేథి. 

 ప్రేగు ఆరోగ్యం దెబ్బతీసే 10 చెత్త అలవాట్లు..

ఉదయాన్నే చక్కెర అధికంగా ఉండే తృణధాన్యాలు తినడం
నిద్ర లేవగానే మీ ఫోన్‌ చూడడం 
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం
ఉదయం లేవగానే ముందుగా వాటర్​ తాగకపోవడం లేదా హైడ్రేషన్​పై శ్రద్ద పెట్టకపోవడం 
మల విసర్జనకు పద్దతి లేకుండా పోవడం 
టాయిలెట్‌లో ఉన్నప్పుడు మీ ఫోన్‌లో స్క్రోల్ చేయడం
మీ మొదటి భోజనంలో ప్రోటీన్స్​లేకపోవడం 
ఉదయం సూర్యరశ్మీ మిస్  కావడం 
పదే పదే స్నూజ్ చేయడం
అల్పాహారంలో ప్రోటీన్, ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, పాలీఫెనాల్స్ మిస్ చేయడం 

మెరుగైన జీర్ణక్రియ కోసం..

ఆరోగ్యకరమైన అలవాట్లు ముఖ్యమైనవే అయినప్పటికీ వాటిని ఆరోగ్యకరమైన భోజనంతో జత చేయడం మరింత మంచిది మెరుగైన జీర్ణక్రియ కోసం వైద్యులు ఆమోదించిన 

ఫైబర్-ప్యాక్డ్​ 10 బ్రేక్ ఫాస్ట్​లు.. 

ఓట్స్, క్యారెట్లు, బఠానీలు, బీన్స్‌తో కూరగాయల ఉప్మా 
బాదం పాలు ,దానిమ్మ గింజలతో చియా పుడ్డింగ్ 
కొబ్బరి చట్నీతో పప్పు దోస (అడై) లతో బ్రేక్​ ఫాస్ట్​